Waltair Veerayya 3 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకి మొదటి అటు నుంచి మంచి పాజిటివ్ టాక్  రావడంతో సినిమాకి మంచి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా మూడు రోజులపాటు ఎలా వసూలు చేసింది అనే విషయం మీద దృష్టి పెడదాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ సినిమా మొదటి రోజు 22 కోట్ల 90 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే రెండో రోజు 11. 95 లక్షలు వసూలు చేసింది. ఇక మూడోరోజు 12 కోట్ల 61 లక్షలు వసూలు చేసి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 47 కోట్ల 46 లక్షలు షేర్ 76 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మూడో రోజు ఏరియా వారీగా చూస్తే నైజాం ప్రాంతంలో ఐదు కోట్ల పది లక్షలు, రెండు కోట్ల 48 లక్షలు, ఉత్తరాంధ్రలో కోటి 54 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లా 98 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 46 లక్షలు, గుంటూరు జిల్లాలో 69 లక్షలు, కృష్ణాజిల్లా 90 లక్షలు, నెల్లూరు జిల్లాలో 46 లక్షలు మొత్తం 12 కోట్ల 61 లక్షల షేర్, 20 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


ఇక ఈ సినిమా మూడు రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారత దేశంలో మూడు కోట్ల 90 లక్షలు, ఓవర్సీస్ లో ఏడు కోట్ల యాభై ఐదు లక్షలు వసూలు చేయడంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 58 కోట్ల 91 లక్షల 101 కోట్లు 95 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా 108 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు.


సినిమా బిజినెస్ ఇప్పటివరకు 88 కోట్లు చేయడంతో 89 కోట్లు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇంకా సినిమా 30 కోట్ల తొమ్మిది లక్షల సంపాదిస్తే బ్రేక్ ఈవెన్ అయి హిట్ స్టేటస్ సాధిస్తుంది. ఆదివారంతో పాటు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు అందరూ థియేటర్లకు క్యూ కట్టడంతో కొంతమంది వసూళ్లు పెరిగాయి అని చెప్పవచ్చు.


నోట్: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు


Also Read: Veera Simha Reddy Day 4: మూడో రోజు కంటే పుంజుకున్న వీర సింహా రెడ్డి కలెక్షన్స్.. అది కలిసొచ్చిందే!


Also Read: Mamta Mohandas: మరో వ్యాధి బారిన పడిన మమతా మోహన్ దాస్.. ఎలా అయిపోయిందో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook